ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి పట్టణం శివాలయం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి తూముల అచ్యుతవల్లి పాల్గొన్నారు.అనంతరం ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు వైసిపి వార్డు సభ్యులకు ఓట్లువేయమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి మాజీ సర్పంచ్ బొద్దల సత్యనారాయణ, బొద్దల పద్మావతి 17వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి కొ మ్మోజి హరి ఎనిమిదవ వార్డు అభ్యర్థి ముగిది మురళి పాల్గొన్నారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.