BREAKING
కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో నియమావళి పాటించాలి:

పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం

Select Suryaa Now
పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం

 ఎదులాపురం 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో కనువిందు చేసిన రంగురంగుల బతుకమ్మ

పూల పండుగతో పులకించిన ఇందిరమ్మ కాలనీ.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మ వేడుకలు

 ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో పండుగ శోభను సంతరించుకున్నాయి. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను ఆకట్టుకుంది.

పసుపు, నారింజ, గులాబీ తదితర రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ తెలంగాణ పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పింది. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బతుకమ్మను అలంకరించి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొనడం పండుగకు మరింత కళను తీసుకొచ్చింది. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం విశేషం.

పూల పరిమళాలు, సంప్రదాయాల సోయగాలు, మహిళల ఉత్సాహంతో ఇందిరమ్మ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.