ఎన్నికల్లో నియమావళి పాటించాలి:
టి నరసాపురం: సూర్య న్యూస్ స్థానిక ఎన్నికల తప్పనిసరిగా నియమావళి పాటించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి గోవింద రాజు తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులకు, అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఖర్చు వివరాలతో పాటు పోలింగు స్టేషన్ల వివరాలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో వైవిఆర్వీ ప్రసాద్ , తహసిల్దార్ టి నాగరాజు, ఎస్ ఐ ఎం జయబాబు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ రిపోర్ట్ అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా,