బంగారు మైసమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఫరూక్ నగర్, రంగారెడ్డి; శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్నగర్ సమీపంలోని సోలిపూర్ బైపాస్లో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజ ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో జరిగిన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు మైసమ్మ తల్లి కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రులు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని, ఇలాంటి పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, సతీష్, ప్రదీప్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.