BREAKING
నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో  నగరాభివృద్ధికి మరింత కృషి చేస్తా....కోలగట్ల శ్రావణి

తోటపల్లిలో ఘనంగా దుర్గాదేవి ఉత్సవాలు

Select Suryaa Now
తోటపల్లిలో ఘనంగా దుర్గాదేవి ఉత్సవాలు

గరుగుబిల్లి, సూర్య : మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగముగా పవిత్ర నాగావళి నది తీరాన వెలసి ఉన్న గంగా దుర్గాదేవి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర నాగావళి నదీ తీరాన వెలసి ఉన్న దుర్గాదేవి ఉత్సవాలలో భాగంగా తోటపల్లి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మేళతాళాలతో తరలివచ్చి పవిత్ర నాగావళి నదీ తీరాన వెలసి ఉన్న దుర్గాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇదిలా ఉండగా రావివలస గ్రామానికి చెందిన డ్రాయింగ్ టీచర్ రుగడ  శ్రీనివాసరావు దుర్గాదేవి విగ్రహానికి జీవకల ఉట్టి పడేలా పెయింటింగ్ తో అద్భుతంగా అలంకరించిన నేపథ్యంలో పలువురు భక్తులు అభినందించారు.ఈసంద ర్భంగా డ్రాయింగ్ టీచర్ రుగడ శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించారు. తోటపల్లి గ్రామానికి చెందిన గోవింద మాస్టారు, నాగరాజు, దుర్గాదేవి కమిటీ సభ్యులు తదితరులు రుగడ శ్రీనివాసరావు దంపతులకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో తోటపల్లి గ్రామానికి చెందిన దుర్గాదేవి కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.