దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదారం సర్పంచ్ రాములు
పరిగి, మేజర్ న్యూస్: పరిగి మండల పరిధిలోని మాదారం గ్రామంలో రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి గ్రామ సర్పంచ్ రాములు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దుర్గాదేవి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు.