సూర్య జగిత్యాల ప్రతినిధి జగిత్యాల ప్రాంత ప్రజలతోపాటు, యావత్ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరికి మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ ప్రజల జీవన విధానంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం. బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండగ. పూలను దైవ స్వరూపంగా భావించి, గౌరమ్మను కొలిచే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణ ఆడ బిడ్డలది అన్నారు.జమ్మి చెట్టు విజయానికి చిహ్నం. అందరి జీవితాల్లో సుఖ సంతోషలూ వెల్లి విరియాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ జగిత్యాల ప్రాంతమంతోపాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.