BREAKING
లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ --ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా చర్యలు

Select Suryaa Now
ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా చర్యలు

శ్రీకాకుళం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ పోలీసు సబ్‌డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంబంధిత మండలాలు, పట్టణాల్లో 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమలులో ఉన్న ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అనుమతులు తప్పనిసరి : పోలీసు ఆంక్షలు అమలులో ఉన్న ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత నిబంధనల ప్రకారం అనుమతించిన పరిమితులకు మించి గుంపులుగా గుమిగూడరాదని సూచించారు. ప్రధాన రహదారులపై అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : అమలులో ఉన్న పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

పోలీసులకు సహకరించాలి : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.