BREAKING
రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో 

నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి

Select Suryaa Now
నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల  *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి

గరుగుబిల్లి, సూర్య : ఎంపీటీసీ ఎన్నికలకు సంబం ధించి సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ వెల్లడించారు. ఈమేరకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం స్థానిక విలేకరులతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ మాట్లాడారు. ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొ న్నారు.ఎంపీటీసీ ఎన్నికల్లో భాగముగా ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. 24వ తేదీన ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి వచ్చిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. 25వ తేదీన నామినేషన్ ఫారాలలో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరిం చిన నామినేషన్లపై అప్పీలు చేసుకోవ చ్చన్నారు.అదే 26వ తేదీన ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం ఉంటుందన్నారు.27వ తేదీన పోటీ బరిలో ఉండ దలుచుకో   లేని అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకోవచ్చన్నారు.అదే విధంగా 27వ తేదీ సాయంకాలం ఎంపీటీసీ జడ్పిటిసి పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీసు బోర్డు లో ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు.వచ్చే నెల మూడవ తేదీన ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికల కు పోలింగ్ జరుగుతుందని ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడిం చారు.ఐదవ తేదీన ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఓట్ల లెక్కింపు తదుపరి ఫలితాలను ప్రకటించడం జరుగుతుం దని అనంతరం గెలుపొందిన వారికి ఎన్నికల అధికారిచే ధ్రువీకరణ పత్రము అందజేయడం జరుగుతుందని ఎంపీడీవో సూర్యనారాయణ పేర్కొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.