BREAKING
రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో 

పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి

Select Suryaa Now
పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి

పెద్ద శంకరంపేట, : పెద్ద శంకరంపేటతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను సర్వాంగసుందరంగా పేర్చి పండుగ శోభను చాటుకున్నారు.గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. మహిళల ఆటపాటలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం పెద్ద శంకరంపేటలోని బతుకమ్మ కుంటతో పాటు తిరుమలాపూర్ చెరువు, ఇతర గ్రామాల్లోని సమీప చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు మండలవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.