57,58 వార్డు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు
అక్కయ్యపాలెం, సూర్య : విశాఖ ఉత్తర నియోజకవర్గం లో 57 వ వార్డు, 58 వ వార్డు కార్పొరేట్ అభ్యర్థులు కేవీఎన్ శశికళ, బొడ్డేటి అనురాధ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనందరి ప్రియతమ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొండవాలు ప్రాంతాలును ఎంతో అభివృద్ధి చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని మరలా ఇక్కడ అభివృద్ధి కొనసాగాలంటే వైసిపి కార్పొరేట్ అభ్యర్థులను, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో భూములను పప్పు బెల్లం ల ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారని. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని, వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే విశాఖలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లు శంకర్రావు, సీనియర్ నాయకులు, నీలి రవి, బొగ్గు శ్రీను, బొడ్డేటి నాగు, వార్డు అధ్యక్షుడు డోప్ప శ్రీను, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : బి. రామకృష్ణ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం.