చప్పబుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థి ఖరారు
మక్కువ , సూర్య : స్థానికత ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అభ్యర్థుల వేటలో ఆయా పార్టీ నాయకులు తల మునకలై ఉన్నారు. వైసీపీ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు సునాయసంగా ఖరారు చేస్తున్నారు.
మండల కేంద్రమైన మక్కువతో సహా ఇప్పటికే పది ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి సంగతి తెలిసిందే. ఆదివారం నాడు చప్పబుఛ్ఛంపేట ఎంపీటీసీ అభ్యర్ధితో పాటు, సర్పంచ్ అభ్యర్థిని కూడా మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు ఖరారు చేసి విజయ తిలకం దిద్దారు. మండలంలో శంబర గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి నియామకం కూడా దాదాపు కరారైంది. ఇంకా వెంకట బైరిపురం, కవిరిపల్లి, కాశీపట్నం, ఏ వెంకంపేట, డీ శిర్లాం ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
అభ్యర్థుల వేటలో టిడిపి నాయకత్వం:
ఇదిలా ఉండగా.. ఎంపీటీసీ అభ్యర్థుల వేటలో టిడిపి నాయకత్వం తల ములకై ఉంది. మండలంలో అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరీలో దించేందుకు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు దృష్టి సారిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన శంబర గ్రామ ఎంపీటీసీ స్థానాన్ని తాజా మాజీ ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు కి కేటాయించినట్టు సమాచారం. ఈ గ్రామంలో యాదవులు ఎంపీటిసి స్థానాన్ని తను సూచించిన వ్యక్తికే కేటాయించాలని అధిష్టానాన్ని అభ్యర్థించినప్పటికీ, అధిష్టానం తోశ పుచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన శంబర శ్రీ పోలమాంబ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కేటాయించడంతో గ్రామంలో పార్టీకి తీరని లోటు జరిగిందని అధిష్టానం హెచ్చరించినట్టు తెలిసింది. ఇంకా గ్రామ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్టానం హెచ్చరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం శంబర ఎంపీటీసీ స్థానానికి తీళ్ల పోలినాయుడు కి టిక్కెట్టు ఖరారు చేసినట్టు తెలిసింది.
రెబల్ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పెంట తిరుపతిరావు:
ఎంపీటీసీ ఎన్నికల్లో తన మార్కును చూపించుకునేందుకు టిడిపి సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు రెబల్ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్టు తాజా సమాచారం. శంబర లో కూడా తమ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపేందుకు పెంట తిరుపతిరావు సన్నాహాలు చేస్తున్నట్టు బోగట్టా .! కోన గ్రామంలో తమ ఎంపీటీసీ అభ్యర్థిని పెంట తిరుపతిరావు కఖారు చేసినట్టు తెలిసింది.
శంబర విగ్రహ రాజకీయం :
మండలంలో శంబర గ్రామంలో వైసీపీ కి చెందిన ఒక వర్గం విగ్రహ రాజకీయం నేర్పుతున్నట్టు బోగట్టా.! గడిచిన వారం రోజులుగా ఎంపీటీసీ అభ్యర్థి కోసం మల్లు గొల్లలపడిన గ్రామ నాయకులు, పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చేసేదిలేక విగ్రహ రాజకీయం నడిపినట్టు బోగట్టా.! గ్రామంలో వైయస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులను బ్రతిమాలి ఎంపీటీసీగా పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. వైయస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సదర వ్యక్తులకు రాజకీయాలతో ప్రమేయం లేకపోయినప్పటికీ, మండల్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందన్న భరోసా ఇచ్చి బలవంతంగా రంగం లోకి దింపుతున్నట్టు తెలియవచ్చింది.
రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.