BREAKING
పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు

Select Suryaa Now
మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు

పార్వతీపురం, సూర్య : పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల్లో అంతిమంగా వైసిపి పార్టీ విజయమే లక్ష్యంగా చేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు పార్వతీపురం పురపాలక సంఘం చైర్ పర్సన్ అభ్యర్థిగా పార్టీ తరుపున పట్నాన సాయిశ్రీ అభ్యర్థిత్వాన్నీ ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగినది ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే  అలజంగి జోగారావు  తెలియచేస్తూ వైసీపీ నాయకులు పాట్నాన కిరణ్ కుమార్ సతీమణి శ్రీమతి పట్నాన సాయిశ్రీ కి పార్టీ కండువా వేసి చైర్ పర్సన్ గా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ బి ఫారం అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంనీ ధీటుగా ఎదుర్కొని పార్వతీపురం లో వైసిపి కందా వెగురవేయడమే లక్ష్యంగా చేసుకుని అందరూ కలిసి పని చేయాలని అందరికీ పిలువు ఇవ్వడం జరిగినది. ఈ కీలక నేపథ్యంలో పూర్తి మద్దతు తెలిపిన కళింగ వైశ్య సంఘం పెద్దలు అందరికీ ధన్యవాదములు అని తెలుపుతూ అన్ని వర్గాలతో కలిసి పనిచేసి ప్రజల ఆశీర్వాదములు పొంది విజయం సాధించేందుకు అందరూ కలిసి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టిట్కో చైర్మన్ జమాన ప్రసన్నకుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పట్నాన కిరణ్, రెడ్డి రవికుమార్, కోడిగుడ్ల ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి శ్రీనివాసరావు, కళింగ వైశ్య సంఘం పెద్దలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.