telanagana
అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి! మండలం ప్రజల డిమాండ్
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని మండల వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారిపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ప్రయాణికులు, వాహనదారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంగడి రోజు రహదారిపై రద్దీ పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, అంగడి బజారుకు అనువైన స్థలాన్ని కేటాయించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.