వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి
– ఎన్నికల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య
నరసన్నపేట నవంబర్ 24 మేజర్ న్యూస్ : పోలాకి మండలం మబగాం గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కోరారు.
మబగాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ధర్మాన ప్రభాకరరావు, వార్డు సభ్యురాలు మెండ రమణమ్మకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆదరణ, మద్దతుతో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.