వైఎస్ఆర్సిపి నాయకురాలు పార్వతమ్మను పరామర్శించిన తలారి హర్ష.
అనంతపురం మేజర్ న్యూస్ : : అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పొంక గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పార్వతమ్మను పార్టీ యువ నాయకుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య తనయుడు తలారి సాయి హర్ష, జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న వారు పార్వతమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పార్వతమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పార్టీ నాయకురాలిని పరామర్శించి, ఆమెకు మనోధైర్యం కల్పించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బసవరాజు, గంగాధరతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.