BREAKING
అర్హులకు పెన్షన్ పత్రాల పంపిణీ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు లబ్ధిదారుల కృతజ్ఞతలు *5317 మందికి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ* అమెరికా బిగ్ టెక్ దిగ్గజాల తిరస్కరణతో నిరాశలో నిర్వాహకులు లాంగ్-రేంజ్ మ్యారీటైమ్ రికాన్నైసెన్స్ ఆపరేషన్లకు 50 వసంతాలు విన్ తైక్వాండో అకాడమీలో ఘనంగా బెల్ట్‌లు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. నేడు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు పలు మార్గాల్లో మళ్లింపు సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ‘శ్రీ సుధ’ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు ఎంపిక అంతర్జాతీయ కోర్టులో విచారణ మరియు గాజాపై దాని ప్రభావం డిప్యూటీ డిఈఓ పై చర్యలు చేపట్టాలి :- ఏఐఎస్ఎఫ్ పదిహేనేళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతున్న క్రేజీ కాంబో.. నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు టోక్యోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్.. రేపు సిద్దిపేటలో షురూ నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం. : ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం

డిప్యూటీ డిఈఓ పై చర్యలు చేపట్టాలి :- ఏఐఎస్ఎఫ్

Select Suryaa Now
డిప్యూటీ డిఈఓ పై చర్యలు చేపట్టాలి :- ఏఐఎస్ఎఫ్

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: డిప్యూటీ డిఇఓ తాయిలాలకు అలవాటు పడ్డాడు కాబట్టే ఊటుకూరు వెంకట సుబ్బయ్య హైస్కూల్ నందు ఇటువంటి ఘటన చోటుచేసుకుందని తక్షణం జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు జిల్లా సహాయ కార్యదర్శి పీటర్ లు డిమాండ్ చేశారు.
బుధవారం  స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ పట్టణంలోని ఊటుకూరు వెంకటసుబ్బయ్య ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై జరిగినటువంటి లైంగిక చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోకుండా డిప్యూటీ డిఇఓ సంజాయిషీ నోటీసులకు పరిమితమయ్యాడన్నారు. 
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో మాథ్స్ టీచర్ కి సపరేట్ రూమ్ అంటూ ఏ హెడ్మాస్టర్ కేటాయించారని కానీ ఇక్కడి ఇన్చార్జ్ హెడ్మాస్టర్ అమర్నాథరెడ్డి మ్యాథ్స్ టీచర్ కు సపరేట్ రూమ్ కేటాయించారన్నారు.ఎందుకు కేటాయించావని డిప్యూటీ డిఈఓ శివప్రసాద్ హెడ్మాస్టర్ ను సంజాయిషీ నోటీసులో ప్రశ్నించలేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాథ్స్ టీచర్ హెడ్మాస్టర్ రూమ్ లో హెడ్మాస్టర్ సమక్షంలో విద్యార్థినిలను అడగకుండా, తన రూముకి విద్యార్థినిలను ఎందుకు ఒంటరిగా రమ్మని పిలుస్తున్నాడు హెడ్మాస్టర్ గా ప్రోత్సహిస్తున్నావా అనే ప్రశ్నలు సంజాయిషీ నోటీసులో పేర్కొనలేదన్నారు. కో ఎడ్యుకేషన్ స్కూల్స్లలో బాల బాలికలు ఇరువురు మాట్లాడుకోవడం నేరమా అని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో విచారించడం నేరం కాదన్నట్టు అది మామూలు విషయం అన్నట్లు అమర్నాథ్ రెడ్డి మీడియా వారికి చెప్పడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంటే విద్యార్థినుల పట్ల ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడం హెడ్మాస్టర్ కు తెలుసని హెడ్మాస్టర్ కు తెలుసు అనే విషయం డిప్యూటీ డిఇఓ శివప్రసాద్ కు తెలుసని కాబట్టే వారిని కాపాడడానికి సంజయ్సీ నోటీసులో ఆలస్యంగా పై అధికారులకు ఎందుకు చెప్పావు, బయటి వ్యక్తులు లోపలికి వచ్చే సందర్భంలో మెయిన్ గేటుకు తాళాలు ఎందుకు వేయలేదు అనే  హాస్యాస్పదమైన ప్రశ్నలను హెడ్మాస్టర్ అమర్నాథ్ రెడ్డికి వివరణ పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం విద్యార్థిని తన తల్లిదండ్రులకు అక్కడి ఉపాధ్యాయుల ద్వారా ఫోన్ చేసి విషయం చెబితే వారితోపాటు అక్కడికి వచ్చిన అధికార పార్టీ నాయకులు పంచాయతీ చేశారని మరి బయట వ్యక్తులని ఎవరిని ఉద్దేశించి డిప్యూటీ డిఇఓ సంజయ్ సింగ్ నోటీసులో పేర్కొన్నాడు తెలపాలన్నారు. జూలై 24 వ తారీఖున ఇదే హైస్కూల్లో దివ్యాంగుడైన సోషల్ టీచర్ ఒకరు హైస్కూల్లో హెడ్మాస్టర్ అమర్నాథ్ రెడ్డి విధుల్లో తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నాడని కలెక్టర్ గారు న్యాయం చేయాలని పిజీ ఆర్ ఆర్ లో ఫిర్యాదు చేసినవి అన్ని పత్రికల్లో వచ్చాయని అయితే విచారణలో డిప్యూటీ డిఇఓ హెడ్మాస్టర్ మరియు మాథ్స్ టీచర్ తో తాయిలాలు తీసుకొని ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. ఎఫ్ ఎస్ సి హెడ్మాస్టర్ గా ఉన్న అమర్నాథ్ రెడ్డి ట్రాన్స్ఫర్ వచ్చినప్పటికీ వెళ్లకుండా ఇదే హైస్కూల్లో గత 15 రోజులుగా విధులు నిర్వర్తిస్తుంటే డిప్యూటీ డిఇఓ ఎందుకు చర్యలు చేపట్టలేదన్నారు. డిప్యూటీ డిఇఓ శివప్రసాద్ కు ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి ఘటనలన్నిటిని తెలుసని హెడ్మాస్టర్ ఇచ్చే ముడుపులకై ఆశపడి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థినులతో మాట్లాడిన వీడియోలు ఏఐఎస్ఎఫ్ వారు డిఈఓ కు ఆర్ జె డి కి పంపారని అనంతరం జిల్లా డీఈవో డిప్యూటీ డిఈఓ ను నివేదిక అడిగితే డిప్యూటీవో మరో ఎంఈఓ ను తీసుకొని ఇక్కడి విద్యార్థినీలను విచారించకుండా ఎవరైతే శుక్రవారం రోజు  మ్యాథ్స్ టీచర్ పై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారో ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టారన్నారు.అదే విద్యార్థిని సోమవారం హైస్కూల్ కు వస్తే హెడ్మాస్టర్ ఇంటికి పంపించారని ఈ విషయం డిప్యూటీ డిఈఓ కూడా తెలుసని సంజాయిషీ నోటీసులో ఎందుకు పేర్కొనలేదని వారు ప్రశ్నించారు. డిప్యూటీ డిఇఓ శివప్రసాద్ అవినీతికి అంతే లేదని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి ఏడాది రెన్యువల్ కు ఒక్క స్కూల్నుండి 60 నుండి 70 వేల రూపాయలు ఖర్చవుతాయని ముడుపులు బలవంతంగా తీసుకుంటాడని ప్రైవేట్ విద్యా సంస్థల వారు వాపోతున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి అవినీతి అధికారి మైనర్ విద్యార్థినిలకు న్యాయం చేయడని తక్షణం డిప్యూటీ డి ఈ ఓ పై హెడ్మాస్టర్ పై చర్యలు చేపట్టాలని ఈ హై స్కూల్ లో జరుగుతున్నటువంటి వేధింపులపై ఏసీడీఎస్ అధికారులతో పాటు బాలల హక్కుల కమిషన్ లతో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి తౌసిఫ్ కోశాధికారి నాని ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జహీర్లు పాల్గొన్నారు.