BREAKING
ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి మరో ఓటీటీలోకి కికు యనమల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ తో పెరుగుతున్న బాధితులు - ప్రస్తుతం మరో 9 మంది విద్యార్థినులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు !! వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం పేద విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం వరం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షురూ.. పూర్తి షెడ్యూల్, జట్లు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు చెత్త సేకరణకు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు ఒకే చిత్రంలో ఏకంగా 16 పాత్రల్లో నటిస్తున్న యోగిబాబు.. ప్రభుదేవా 'మూన్‌వాక్' మూవీలో సరికొత్త రికార్డు : ప్రిన్స్ విలియమ్‌కు ఘనంగా బాలీవుడ్ స్వాగతం.. కరణ్ జోహార్ ఆఫీస్‌లో కరీనా, సైఫ్ హంగామా ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు.. మరోసారి అలరించనున్న ప్రేమలు జోడీ.. ‘హలో డియర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ రొమాన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ‘క్రిమ్సన్ పియర్’ చిత్రం ప్రారంభం.. సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా బాలీవుడ్‌లో సంచలన చిత్రం వాయిదా.. సన్నీ డియోల్ ‘సూర్య’ విడుదల ఎందుకు నిలిచిపోయింది?

చెత్త సేకరణకు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు

Select Suryaa Now
చెత్త సేకరణకు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు

హిందూపురం :- 15వ వార్డులో చెత్త సేకరణ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పద్మభూషణ్  నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఎలక్ట్రిక్ ఆటోలను మంజూరు చేయడం జరిగింది. కౌన్సిలర్ దుర్గ మంజుల నవీన్ ఆధ్వర్యంలో ఈ ఆటోలకు పూజ కార్యక్రమం నిర్వహించి సేవలోకి పంపిణీ చేశారు.15వ వార్డులోని డీఆర్ కాలనీ, డైమండ్ లేఅవుట్, అనంతపద్మనాభ ఎక్స్‌టెన్షన్ ప్రాంతాల్లో శానిటేషన్ కార్మికుల కొరత కారణంగా చెత్త సేకరణలో తీవ్ర ఇబ్బంది నెలకొని ఉంది. చెత్తను తీసుకెళ్లడానికి వాహనాలు లేక ప్రజలు తీవ్ర అవస్థపడుతున్నారని వార్డు ప్రజలు కౌన్సిలర్ దుర్గ మంజుల నవీన్‌కు తెలియజేశారు.వారి అభ్యర్థనపై కౌన్సిలర్ వెంటనే స్పందించి, ఎమ్మెల్యే కార్యదర్శులు సురేంద్ర బాబు, శ్రీనివాస్ రావులతో చర్చించారు. శానిటేషన్ కార్మికులు, చెత్త సేకరణ వాహనాల అవసరం గురించి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, వారు మునిసిపల్ కమిషనర్ మల్లికార్జునకు సూచించి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను వార్డుకు మంజూరు చేయించారు.కొత్తగా మంజూరైన రెండు ఎలక్ట్రిక్ ఆటోలకు కౌన్సిలర్ దుర్గ మంజుల నవీన్ ఆధ్వర్యంలో పూజ నిర్వహించారు. ఈ ఆటోల ద్వారా వార్డులో చెత్త సేకరణ వేగవంతం కాగలదని, పరిశుభ్రత మెరుగుపడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను తక్షణమే పరిష్కరించినందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,వార్డ్ కౌన్సిలర్ దుర్గ మంజుల నవీన్ లకు  వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వడ్డే ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి దుర్గ నవీన్, వార్డు నాయకులు సునీల్ కుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దుర్గ నాని, సికిందర్, శివ, గోవిందా, నరసింహమూర్తి, సురేంద్ర బాబు, అబ్దుల్ అలీం, ఫైరోజ్, వెంకటేష్ మూర్తి, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహప్ప, నంజుందప్ప, శానిటేషన్ సెక్రటరీ రమేష్ బాబు పాల్గొన్నారు.

 నేటి దినపత్రిక సూర్య 

హిందూపురం స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర