ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి
సూర్య శంకరపట్నం: మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి, అన్నదాతలను ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, దండు కొమురయ్య, అలివేలు సమ్మిరెడ్డి, జంగ జైపాల్, దాసరపు నరేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు