కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ తో పెరుగుతున్న బాధితులు - ప్రస్తుతం మరో 9 మంది విద్యార్థినులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు !!
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురవుతున్న విద్యార్థినుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది,ప్రస్తుతం ఇప్పుడు కూడా మరో 9 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని అంబులెన్స్ లో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,ఆసుపత్రిలో వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో మిగిలిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది,విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో అంబులెన్స్ వెంటే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్