పేద విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం వరం
సూర్య శంకరపట్నం: పేద విద్యార్థుల ఆకలి తీర్చడంతో పాటు చదువుపై ఆసక్తి పెంచేందుకు సీఎం అల్పాహార పథకం ఉపయోగపడుతుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం కేశవపట్నం ఆదర్శ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ నిత్యం చదువుపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అనిల్‌ప్రకాశ్, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత తదితరులు పాల్గొన్నారు.