BREAKING
ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి మరో ఓటీటీలోకి కికు యనమల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ తో పెరుగుతున్న బాధితులు - ప్రస్తుతం మరో 9 మంది విద్యార్థినులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు !! వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం పేద విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం వరం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షురూ.. పూర్తి షెడ్యూల్, జట్లు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు చెత్త సేకరణకు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు ఒకే చిత్రంలో ఏకంగా 16 పాత్రల్లో నటిస్తున్న యోగిబాబు.. ప్రభుదేవా 'మూన్‌వాక్' మూవీలో సరికొత్త రికార్డు : ప్రిన్స్ విలియమ్‌కు ఘనంగా బాలీవుడ్ స్వాగతం.. కరణ్ జోహార్ ఆఫీస్‌లో కరీనా, సైఫ్ హంగామా ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు.. మరోసారి అలరించనున్న ప్రేమలు జోడీ.. ‘హలో డియర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ రొమాన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ‘క్రిమ్సన్ పియర్’ చిత్రం ప్రారంభం.. సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా బాలీవుడ్‌లో సంచలన చిత్రం వాయిదా.. సన్నీ డియోల్ ‘సూర్య’ విడుదల ఎందుకు నిలిచిపోయింది?

వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Select Suryaa Now
వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

 

జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని సాల్వెంట్ రికవరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ఈ ఘటన అనంతరం పెద్ద ఎత్తున పొగలు వెలువడటంతో గడ్డపోతారం గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దం గ్రామం వరకు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగలతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పరిశ్రమలో జరిగిన నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ చేపట్టి ప్రజలకు భరోసా కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.