BREAKING
అర్హులకు పెన్షన్ పత్రాల పంపిణీ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు లబ్ధిదారుల కృతజ్ఞతలు *5317 మందికి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ* అమెరికా బిగ్ టెక్ దిగ్గజాల తిరస్కరణతో నిరాశలో నిర్వాహకులు లాంగ్-రేంజ్ మ్యారీటైమ్ రికాన్నైసెన్స్ ఆపరేషన్లకు 50 వసంతాలు విన్ తైక్వాండో అకాడమీలో ఘనంగా బెల్ట్‌లు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. నేడు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు పలు మార్గాల్లో మళ్లింపు సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ‘శ్రీ సుధ’ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు ఎంపిక అంతర్జాతీయ కోర్టులో విచారణ మరియు గాజాపై దాని ప్రభావం డిప్యూటీ డిఈఓ పై చర్యలు చేపట్టాలి :- ఏఐఎస్ఎఫ్ పదిహేనేళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతున్న క్రేజీ కాంబో.. నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు టోక్యోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్.. రేపు సిద్దిపేటలో షురూ నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం. : ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టు..

Select Suryaa Now
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టు..
హైదరాబాద్, నవంబర్ 18: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న భారీ డ్రగ్స్ రాకెట్‌ను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. స్నాప్‌చాట్ (Snapchat) యాప్ ద్వారా రహస్యంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.240 కిలోల గంజాయితో పాటు 16.59 గ్రాముల ఖరీదైన 'ఓజీ కుష్' (OG Kush) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మణికొండ ల్యాంకో హిల్స్ ప్రాంతం నుంచి కారులో డ్రగ్స్ తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 'OGdude420', 'Dude OG 420' అనే పేర్లతో స్నాప్‌చాట్‌లో ప్రత్యేక ఖాతాలను నిర్వహిస్తూ, యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 నుంచి 900 మంది కస్టమర్లకు వీరు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.