BREAKING
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో బయోకాన్ దూకుడు క్రిమియా రహదారి వంతెనను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ దాడులు పంజాబ్‌లో బీజేపీ సమరభేరి నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియామకం అమెరికాను తాకిన టెక్ అంతరాయాల అల ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీబీ-గ్రామ్ జీ చట్టం కింద జవాబుదారీతనం పెంపు ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో రానున్న 'పంచాయత్ సీజన్ 5' ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం..నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన*

అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన*

Select Suryaa Now
అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన*

*సూర్య,అశ్వారావుపేట :*అశ్వారావుపేట నియోజకవర్గంలో గురువారం (19-11-2026) ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో గ్రామీణ మహిళా సమాఖ్య (వివో) భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం ప్రారంభం, సీఎంఆర్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గ్రామీణ మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో వివో భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

*ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్*

*ఉదయం :*

- ఉదయం 8:30 గంటలకు – గండుగులపల్లిలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

- ఉదయం 9:00 గంటలకు – రెడ్డిగూడెంలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

- ఉదయం 9:30 గంటలకు – శ్రీరాంపురంలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

- ఉదయం 10:00 గంటలకు – మార్పుగూడెంలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

- ఉదయం 11:00 గంటలకు – అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

*మధ్యాహ్నం :*

- మధ్యాహ్నం 12:00 గంటలకు – అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం ప్రారంభోత్సవం

- మధ్యాహ్నం 2:00 గంటలకు – ఆసుపాకలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

- మధ్యాహ్నం 2:30 గంటలకు – నారాయణపురంలో మూడు వివో భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు

- మధ్యాహ్నం 3:00 గంటలకు – బచ్చువారిగూడెంలో వివో భవన నిర్మాణానికి శంకుస్థాపన

మహిళా సంఘాల బలోపేతం, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కవర్ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పి ఆర్ ఓ కొర్రి వెంకటేశ్వరరావు కోరారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట