నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియామకం
కీసర,మేజర్ న్యూస్:నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం నాగారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాగారం బీజేపీ యువ నాయకులు కౌకుట్ల రాహుల్ రెడ్డి ఎర్ర వామన్‌కు అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ఆయన ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉంటూ ఎస్సీ మోర్చా బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎర్ర వామన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎస్సీ మోర్చా అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.