telangana
ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్.. రేపు సిద్దిపేటలో షురూ
హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'ఇందిరమ్మ కుటుంబ బీమా' (ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్) పథకాన్ని అమల్లోకి తెస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 19న) సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని సుమారు కోటి కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.