ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం
బాపట్ల,మేజర్‌న్యూస్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా తయ్యారీ పై అన్ని జిల్లా కలెక్టర్లు, డి ఆర్ ఓ లు, డి ఈ ఓ లతో రాష్ట్ర సి ఈ ఓ .వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు బాపట్ల జిల్లా కలెక్టరేట్ న్యూ వి సి హల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని సి ఈ ఓ కు వివరించారు. జిల్లాలోని 12 మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు (డిగ్రీ పూర్తి చేసిన) ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ప్రవేట్ విద్య సంస్థలలో పనిచేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు పత్రికా ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, విలేకరుల సమావేశాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నామని, జిల్లా స్థాయిలో పరిశీలించాల్సిన వాటిని పరిశీలిస్తూ, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. తిరస్కరణలు ఎక్కువగా ఉండటంపై అడిగిన ప్రశ్నకు, నకిలీ దరఖాస్తులు, అవసరమైన మూడేళ్ల నివాస అర్హత లేని దరఖాస్తులు ప్రధాన కారణాలని కలెక్టర్ తెలిపారు. ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని సి ఈ ఓ కు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఇంచార్జి డి ఆర్ ఓ.ఎస్.లవన్న,డి ఈ ఓ.శ్రీనివాస్ సింగ్,ఎలెక్షన్ సెల్ పర్యవేక్షకులు షఫి అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.