అర్హులకు పెన్షన్ పత్రాల పంపిణీ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు లబ్ధిదారుల కృతజ్ఞతలు
సూర్య తాడ్వాయి :ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు, ఈరోజు తాడ్వాయి గ్రామం లో అర్హులైన వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం కొత్త పెన్షన్లు కూడా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి సంతోషంగా ఉందని తెలిపారు. తమ కష్టాలను గుర్తించి పెన్షన్లు మంజూరు చేయించిన గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీపీ సెక్రటరీ బాలు మండల అధ్యక్షులు, బండారి సంజీవులు , శ్యామ్ రావు సర్పంచ్ మెట్టు విజయ రాములు ఉప సర్పంచ్ రనీల్ రెడ్డి రాఘవరెడ్డి రంజిత్ రెడ్డి మెట్టు రామ్ చంద్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.