విన్ తైక్వాండో అకాడమీలో ఘనంగా బెల్ట్‌లు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం
ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రోత్సాహం.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
పట్టణంలోని విన్ తైక్వాండో అకాడమీలో నవంబర్ 18న బెల్ట్‌లు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత అక్టోబర్ 31న నిర్వహించిన బెల్ట్ టెస్ట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులైన క్రీడాకారులకు ఈ సందర్భంగా బెల్ట్‌లు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జ్యోతి క్రీడాకారులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందించారు. క్రీడల్లో నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కమల్, విన్ తైక్వాండో అకాడమీ కోచ్‌లు రాజేష్, శ్రీకాంత్, అక్సా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ డిస్కం ప్రెసిడెంట్ మురళీమోహన్ విన్ తైక్వాండో అకాడమీ కోచ్‌లు రాజేష్, శ్రీకాంత్, అక్సాలను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులకు నైపుణ్యాలను నేర్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న కోచ్‌ల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందుకున్న క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని, విన్ తైక్వాండో అకాడమీతో పాటు కడప జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.