సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ‘శ్రీ సుధ’ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు ఎంపిక
డోన్, మేజర్ న్యూస్: కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల స్థాయి 70వ ఎస్‌జీఎఫ్ సాఫ్ట్ టెన్నిస్ ఎంపిక పోటీల్లో శ్రీ సుధ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. డోన్‌లోని మున్సిపల్ టెన్నిస్ స్టేడియంలో ఈ నెల 17న నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
అండర్-14 విభాగంలో జి.వంశీకృష్ణ, ముజాహిద్, అండర్-17 విభాగంలో కె.బాలాజీ, టి.ప్రకాష్, అండర్-19 విభాగంలో టి.రాఘవ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 23, 24, 25 తేదీల్లో అనంతపురం జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్ సాధానగిరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, మనోహర్, రవికుమార్, సురేష్‌లను పాఠశాల చైర్మన్ సాధానగిరి సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్ గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా, ఉపాధ్యాయులు సలాం ఖాన్, రాజు, నాగేంద్ర, లోకేష్ అభినందించారు.
చిత్రవివరణ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల చైర్మన్ సాధానగిరి సుదర్శన్, కరస్పాండెంట్ వేణుగోపాల్, డైరెక్టర్లు, ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు