telangana
వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ మాఠాధిపతి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల ప్రణాం మల్టీపర్పస్ డే కేర్ సెంటర్ కు గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీశ్రీ యోగానంద సరస్వతి సందర్శించినారు. వయోవృద్ధుల డే కేర్ సెంటర్ లో ఉన్న వసతులను పరిశీలించి వారు చాలా సంతృప్తి చెంది, వయోవృద్ధులకు కాలక్షేపం కొరకు ఇలాంటి సదుపాయం కలగజేసిన తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎంతో గొప్పదని కొనియాడారు. ఆదిలాబాద్ లో మంచి ఉద్దేశంతో ,లక్ష్యంతో వయోవృద్ధుల జిల్లా సమైక్య సభ్యులందరూ కార్యదీక్షతో ఎన్నో మంచి కార్యక్రమాలను, వయోవృద్ధుల సంక్షేమం, వయోవృద్ధుల 2007 చట్టం, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షిష అడ్మిస్టేషన్లో చక్కగా క్రమశిక్షణతో నడిపిస్తున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఆ తర్వాత సీనియర్ సిటిజెన్స్ ఉద్దేశించి బోధన చేస్తూ వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, శేష జీవితంలో భార్య పిల్లలతో సంతోషంగా ఉండటమే లక్ష్యంగా, కలిసిమెలిసి జీవిస్తూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా ఉండటానికి మంచి అలవాట్లు, మంచి స్నేహం ,కుటుంబంలో బాంధవ్యం ప్రొద్దున సాయంత్రం ధ్యానం దానితోపాటు స్వల్ప వ్యాయామం నడక ఎంతో అవసరమని ఇవి పాటించడం చాలా వృద్ధాప్యంలో ముఖ్యమని తెలియజేశారు. కులమత వివక్ష లేకుండా అన్ని మతాల వారిని కలుపుకొని వయోవృద్ధుల జిల్లా సమైక్య ముందుకు తీసుకెళుతున్న డాక్టర్ దేవిదాస్ దేశ్ పాండేకి, వారి సహచర మిత్రులందరికి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రస్తుతం యువత మత్తు పానీయాల మత్తు పదార్థాల మరియు డ్రగ్స్ మాదకద్రవ్యాల నివారణ సీనియర్ సిటిజన్స్ ముందుండి పిల్లలకు యువతకు అవగాహన పరచటానికి ముందుండి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల జిల్లా సమైక్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే సెక్రెటరీ రామకులకర్ణి ఆర్గనైజింగ్ సెక్రటరీ శశికాంత్ సభ్యులు కమ్మల నరసింహులు దేవా సింగ్ పూర్ణచందర్రావు జగదీష్ శ్యామ్ రాజ్ గౌడ్ శేషగిరి రావు రమేష్ శర్మ సభ్యులు పాల్గొన్నారు.