చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. త్వరలోనే అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.