రేపు నకరికల్లులో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు
నకరికల్లు, మేజర్ న్యూస్: నకరికల్లు మండల పరిషత్ పాలకవర్గం ఎన్నిక కోసం గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా నూతన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక చేపట్టనున్నారు. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.పోటీ ఉంటే చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి అమల కుమారి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.