BREAKING
ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు తొలిసారిగా 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' ప్రత్యేక విభాగం ప్రారంభం పెరుగుతున్న సామర్థ్యం, శక్తి భద్రత దిశగా పటిష్టమైన అడుగులు భారత్, అజర్‌బైజాన్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపు 57వ ఐఫీ 2026లో సరికొత్తగా యానిమేషన్ విభాగం పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ  మాఠాధిపతి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడాను వివరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు* హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై దాడి 51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ

Select Suryaa Now
ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ

అనంతపురం విద్య, మేజర్ న్యూస్:-ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం, అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రతినిధులు బుధవారం కడపలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులను కలిసి వినతిపత్రం సమర్పించారు. పదో తరగతి నామినల్ రోల్స్‌లో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల సవరణలకు అవకాశం కల్పించాలని, 15 మీటర్ల లోపు భవనాలకు అగ్నిమాపక అనుమతి మినహాయింపు ఉత్తర్వులు అమలు చేయాలని కోరారు. అలాగే భవన వినియోగ ధ్రువపత్రం, పాఠశాలల గుర్తింపు, పునరుద్ధరణ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎ. గోపాల్ రెడ్డి, బాబయ్య, చంద్రశేఖర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్ రెడ్డి, కె. రమణ రెడ్డి, ఎస్. రాఘవేంద్ర, జి. భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, జానకిరాములు, వెంకటరమణ, భాస్కర్ యాదవ్, చెన్నారెడ్డి, నాగేంద్ర రెడ్డి, రవిశంకర్, సూర్యనారాయణ, సుధాకర్, రంగయ్య, నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, టి. రమేష్, నార్పల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుల సానుకూల స్పందనపై సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..