BREAKING
ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత బాలీవుడ్ స్టూడియోను సందర్శించిన రాజకుమారుడు ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు

Select Suryaa Now
పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు

సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : విద్యార్థుల దంత ఆరోగ్య పరిరక్షణకు ముందుకు వచ్చిన కామారెడ్డి జిల్లా దంత వైద్యుల అసోసియేషన్ సేవలు అభినందనీయంఅని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె. వెంకటి అన్నారు.కామారెడ్డి జిల్లాలోని పాఠశాల విద్యార్థుల దంత ఆరోగ్య పరిరక్షణకు ఉచిత దంత వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ మరియు అవసరమైన చికిత్స అందించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ , కామారెడ్డి శాఖ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్ జె. వెంకటి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం రోజున జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో కామారెడ్డి జిల్లా దంత వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులతో డాక్టర్ జె. వెంకటి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు నోటి పరిశుభ్రత, దంత ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. దంత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్.బి.ఎస్.కె. రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం వైద్య బృందాలతో సమన్వయం చేసుకుంటూ దంత వైద్యుల అసోసియేషన్ సభ్యులు సేవలు అందించడం ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం నాణ్యమైన ఉచిత దంత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక బాధ్యతగా పేద, నిరుపేద మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత దంత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ప్రతినిధులకు, సభ్యులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున డాక్టర్ జె. వెంకటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని విద్యార్థుల దంత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.