BREAKING
గత రెండు ఆర్థిక బుడగలు ఏఐ బూమ్‌కు ఎలా అద్దం పడుతున్నాయి? ఉద్యానవన పంటలతో పాటు ఆధారిత ఉత్పత్తులపై రైతుల దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అమెరికా శక్తి ఎగుమతులు గరిష్ట స్థాయికి చేరాయా? ఎవోనిక్ టేకోవర్ కేవలం ఎక్కువ ధర ఇస్తే సరిపోదని స్పష్టం చేసిన వర్గాలు ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత

వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బుధవారం నిర్మల్ పట్టణంలో ప్రస్తుతం నిర్వహించబడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో సంబంధిత అధికారులతో, నూతన వైద్య కళాశాల నిర్మాణ వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య కళాశాల నిర్మాణ పురోగతిని శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని విధాలైన సౌకర్యాలతో కూడిన వైద్య కళాశాల నిర్మించాలన్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. చేపట్టిన పనులు నాణ్యవంతంగా ఉండాలన్నారు. విద్యార్థుల వసతి నివాసాల నిర్మాణాలు కూడా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో వైద్య విద్యను అభ్యసించి, వసతి పొందేందుకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. కళాశాల నిర్మాణ పనులు అన్నింటిని తానే స్వయంగా ప్రతి వారం సమీక్షిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ఆర్ అండ్ బి ఎఈ అంజనేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.