సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి
నగరం, మేజర్ న్యూస్:
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు దేశ సంపదను ధారాదత్తం చేస్తూ, కష్టజీవులైన కార్మిక వర్గానికి నష్టం చేస్తూ, స్వాతంత్రం ముందు నుంచి ఉన్న కార్మిక చట్టాలను తొలగించే ప్రమాదకర లేబర్ కోడ్స్ రద్దుచేయాలని సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన నగరంలో ముఠా వర్కర్స్ యూనియన్ ఆఫీసులో ఛలో ఢిల్లీ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, పెన్షన్, పిఎఫ్, ఇఎస్ఐ, గ్రాట్యూటీ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలన్నారు. డిశంబర్ 1,2,3 తేదీలలో ఢిల్లీ ఆక్యూపై కార్యక్రమంలో నగరం మండలం పరిధిలో కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరం మండలం సిఐటియు కార్యదర్శి కే. గోపి, భవననిర్మాణ కార్మిక సంఘం మండలం అధ్యక్షులు మోర్ల చందర్రావు, ముఠావర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గాలి మరియదాసు, ఇతర కార్మికులు శ్రీను, బంగారయ్య బుల్లిబాబు, ఏషాబు తదితరులు పాల్గొన్నారు