BREAKING
గత రెండు ఆర్థిక బుడగలు ఏఐ బూమ్‌కు ఎలా అద్దం పడుతున్నాయి? ఉద్యానవన పంటలతో పాటు ఆధారిత ఉత్పత్తులపై రైతుల దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అమెరికా శక్తి ఎగుమతులు గరిష్ట స్థాయికి చేరాయా? ఎవోనిక్ టేకోవర్ కేవలం ఎక్కువ ధర ఇస్తే సరిపోదని స్పష్టం చేసిన వర్గాలు ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.కుటుంబంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణించినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారి జీవన భద్రతకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
-18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి అర్హత
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన వ్యక్తులు అర్హత పొందుతారని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని కుటుంబ వివరాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.  జనాభా లెక్కల సేకరణ వివరాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
-335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీల వారీగా, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. జనాభా, వార్డులు/గ్రామపంచాయతీల సంఖ్య ఆధారంగా శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలు, సంతకంతో కూడిన దరఖాస్తు పత్రాలను స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు లబ్ధిదారుల వివరాలు సేకరించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని, ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వివరాలు అందించవలసి ఉంటుందని తెలిపారు. కార్యచరణ ప్రణాళికలో భాగంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో చోటు కల్పించడం జరుగుతుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రజలకు పథకంపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.
-వివరాల నమోదు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో వివరాల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, మొదట జిల్లా పేరు, ఆ తర్వాత మున్సిపాలిటి, మండలం, గ్రామం, వార్డు పేర్లను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకంలో వర్తించే బీమాదారునిగా కుటుంబపెద్ద పోషకుడు, తండ్రి / భర్త పేరు నమోదు చేసి కుటుంబసభ్యుల పేర్లు, బంధుత్వం వివరాలు నమోదు చేయవలసి ఉంటుందని, భవిష్యత్తులో బీమా మొత్తం చెల్లించేందుకు వీలుగా నామినీ పేరు, ప్రతిపాదకులు నియమించిన వ్యక్తి బీమాదారులతో ఉన్న సంబంధం, ఆధార్ సంతకం, చివరగా అధికారిక సంతకం ప్రక్రియతో లబ్ధిదారుని సంతకాన్ని కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారని తెలిపారు.
-అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి
జిల్లాలోని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో నివసించే అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పథకం అర్హతలు, అవసరమైన వివరాలపై అవగాహన కల్పించాలని, అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హుల వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ, అనుకోని ఆపద సమయంలో వారికి అండగా నిలిచే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పని చేయాలని తెలిపారు.