6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష
కర్నూలు, నవంబర్18: కర్నూలు జిల్లాలో అర్హులైన విద్యార్థులు అన్నమయ్య జిల్లా కలికిరి సైనిక్ స్కూల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశ పరీక్షకు డిసెంబర్ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.
2027–28 విద్యా సంవత్సరానికి అన్నమయ్య జిల్లా కలికిరి సైనిక్ స్కూల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE–2027)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో 2027 జనవరి 31న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు https://nta.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన సమాచార బులెటిన్, బ్రోచర్‌ను https://sskal.ac.in వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.