BREAKING
గత రెండు ఆర్థిక బుడగలు ఏఐ బూమ్‌కు ఎలా అద్దం పడుతున్నాయి? ఉద్యానవన పంటలతో పాటు ఆధారిత ఉత్పత్తులపై రైతుల దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అమెరికా శక్తి ఎగుమతులు గరిష్ట స్థాయికి చేరాయా? ఎవోనిక్ టేకోవర్ కేవలం ఎక్కువ ధర ఇస్తే సరిపోదని స్పష్టం చేసిన వర్గాలు ఫ్రాన్స్ భారీ అప్పులపై ఈసీబీ కీలక వ్యాఖ్యలు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలుచేయాలి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* 2027 నాటికి వ్యూహాత్మక లక్ష్యాలను అధిగమించనున్న జనరాలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31న సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష భారత బాండ్ మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల వెల్లువ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పైస్‌జెట్ మాస్టర్ ప్లాన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి మార్కస్ బ్రున్నెర్‌మీర్ నామినేషన్ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా : జిల్లా కలెక్టర్ కె. హరిత

జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 18:- జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను  ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతి పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో మొత్తం 423 పనులు ఉండగా, ఇప్పటివరకు 345 పనులు పూర్తయ్యాయని, మరో 78 పనులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ లను ఆదేశించారు. ఆదోని, ఆలూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు తదితర సబ్ డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లయితే అందుకు గల కారణాలను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఆదేశించారు.. పనులు ప్రారంభించకుండా లేదా నిర్దేశిత వేగంతో పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లతో వెంటనే సమావేశం నిర్వహించి, పనులు ప్రారంభించేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఆదేశించారు..

ఫంక్షనల్ హౌస్హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల లో భాగంగా సబ్‌డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న  పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోని సబ్‌డివిజన్‌లో 443, కర్నూలు సబ్‌డివిజన్‌లో 1100, మంత్రాలయంలో 1300, పత్తికొండలో 1500, ఎమ్మిగనూరులో 1900 చొప్పున పనులు పెండింగ్ లో ఉన్నాయని, పనుల పురోగతిని వేగవంతం చేసి, పెండింగ్ లక్ష్యాలను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఐహెచ్హెచ్ఎల్ నిర్మాణాలకు సంబంధించి  పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలని, నీటి వృథాను పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం నీటి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న పరిమిత నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో నీటి లీకేజీలను తక్షణమే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, ఎక్కడా నీరు వృథా కాకుండా చూడాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఆదేశించారు. ఒక ప్రాంతానికి అధికంగా, మరో ప్రాంతానికి తక్కువగా నీరు సరఫరా చేయకుండా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన తాగునీరు అందించాలన్నారు. నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వాటర్‌మెన్ల వరకు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. నీటి లీకేజీలు, వృథా విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..  ప్రతి గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ లు తదితరులు పాల్గొన్నారు.