BREAKING
ఎన్విడియా కీలక నిర్ణయం...చైనాకు ఏఐ చిప్స్ ఎగుమతులు నిలిపివేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న సీఐ, ఎస్ఐ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత ఆరోగ్య పరీక్షలు తొలిసారిగా 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' ప్రత్యేక విభాగం ప్రారంభం పెరుగుతున్న సామర్థ్యం, శక్తి భద్రత దిశగా పటిష్టమైన అడుగులు భారత్, అజర్‌బైజాన్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపు 57వ ఐఫీ 2026లో సరికొత్తగా యానిమేషన్ విభాగం పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి వయోవృద్దుల సెంటర్ ను సందర్శించిన గోపాలకృష్ణ  మాఠాధిపతి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడాను వివరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ హామీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు* హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై దాడి 51 మందికి చేయూత పింఛన్ల పంపిణీ

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు*

Select Suryaa Now
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం,సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి ,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు*

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమోతు భాస్కర్ రావు విమర్శించారు. బుధవారం పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఎన్నికల హామీల ప్రతులను చించి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశారు.

*తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి*

నాగార్జునసాగర్ డ్యామ్‌లోని డెడ్ స్టోరేజీ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని భాస్కర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి నీటిని తరలించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర నీటి హక్కులను, రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఎండీ యూసుఫ్, దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, అన్నబీమోజు నాగార్జునచారి, ఎండీ ఇలియాస్ ఖాన్, మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, కుందూరు వీరకోటిరెడ్డి, పెద్ది శ్రీనివాసగౌడ్, ఎండీ మాజీద్, దైద సత్యం, పెండ్యాల పద్మ, గుడిసె దుర్గాప్రసాద్, సందేషి అంజన్ రాజు, మర్రి అంజిబాబు, యర్రమళ్ళ దినేష్, ఎర్ర శ్రీను, పశ్యా శ్రీనివాసరెడ్డి, గంగుల బిక్షం యాదవ్, నంద్యాల శ్రీరాం రెడ్డి, పీసీకే ప్రసాద్, పులి జగదీష్, పేరాల కృపాకర్ రావు, పునాటి లక్ష్మీనారాయణ, ప్రకాష్ నాయక్, ఎండీ షోయబ్, వేలిచేటి రామకృష్ణ, శిరసనగండ్ల ఈశ్వరచారి, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, జేరిపోతుల రాములు గౌడ్, దస్రు నాయక్, ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, మాలవాత్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.