telangana
పటిష్టంగా సమగ్ర భూ సర్వే తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే
సూర్య దండేపల్లి : మండలములోని నాగసముద్రం గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి గ్రామసభ నిర్వహించడం జరిగిందనీ. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ నందుర్క సుగుణ గారు, ఉపసర్పంచ్ పూదరి రమణయ్య గారు, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే గారు, రెవెన్యూ శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి ,వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వేకు సంబంధించిన వివరాలు, ప్రజల సందేహాలు మరియు సంబంధిత అంశాలపై చర్చించడం జరిగిందని. భూ సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు సహకరించాలని కోరడం జరిగిందని అన్నారు.