వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం.
ఆధ్యాత్మిక శోభతో వెలిగిన మోదుగులపుట్టి.
భక్తుల నగర సంకీర్తనతో మార్మోగిన గ్రామం.
పలాస,నవంబర్ 29,మేజర్ న్యూస్.
పలాస నియోజకవర్గం,వజ్రపుకొత్తూరు మండలం,మోదుగులపుట్టి గ్రామంలో శ్రీ రామకృష్ణ వివేకానంద భావ ప్రచార కార్యక్రమం 26వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.పరాభవనామ సంవత్సర కార్తీక బహుళ పంచమి, పుష్యమి నక్షత్రయుత ఆదివారం రోజున ఉదయం వేడుకలు మొదలయ్యాయి.భక్తుల నగర సంకీర్తనతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అనంతరం శ్రీరామకృష్ణ, శ్రీ శారదమాత, స్వామి వివేకానంద అష్టోత్తర శతనామ పూజ, కథామృత పఠనం నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రసంగం,భజన,రామకృష్ణ చరణంతో కార్యక్రమాలు,మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు,ప్రజలకు ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్యశ్రీ నిర్విషియానంద మహారాజు (దత్తాత్రేయ ఆశ్రమం,కాపుతెంబూరు), పూజ్యశ్రీ అల్వాన వినయ్ కుమార్ (ఆధ్యాత్మిక వేత్త, దివ్యజీవన సంఘం, ఒడిస్సా), పూజ్యశ్రీ దువ్వాడ శుభలక్ష్మి (జ్ఞానభోదానంద ఆశ్రమం, బెండికొండ) హాజరయ్యారు. ఈ వేడుకల్లో పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.