వైభవంగా ప్రారంభమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు.
త్రిపురాంతకం, మేజర్ న్యూస్. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో స్వయంభూగా వెలసిన శ్రీమత్ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఆదివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 11వ తేదీ ఆదివారం నుండి ఈనెల 20వ తేదీ మంగళవారం వరకు ఉత్సవాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మేళ తాళాలతో నయనానందకరంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు మంగళ వాయిద్యములు అమ్మవారికి అభిషేకము కాలపూజ బాలభోగము పై కార్యక్రమము లు 7 గంటల వరకు ఎనిమిది గంటల నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము రుత్వికరణము పంచగవ్యప్రాసన అఖండ స్థాపన మండపారాధన అష్టదిక్పాలకుల పూజ సప్తశతి పారాయణ, చండీ హోమములు కార్యక్రమంలో వైభవంగా జరిగేందుకు ప్రారంభమయ్యాయి ఆదివారం ఏడు గంటలకు గోపూజ కార్యక్రమం జరిగింది అనంతరం ఉభయ దాతలుచే ఉత్సవమూర్తికి అభిషేకము తదుపరి నిత్య బాల పూజ మహా నివేదన కుంకుమార్చనలు మంగళ వాయిద్యములు కాలపూజ బాలభాగము తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి నిత్యము ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉత్సవమూర్తులకు ఉభయ దాతలచే అలంతార పూజ ప్రాంగణ ఉత్సవం మంత్రపుష్పము పరాకులు పవళింపు సేవలు ఉభయ దాతలకు ఆశీర్వచనము తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయ ప్రాంగణంలోనే వైభవంగా అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం వైభవంగా మేళ తాళాలతో వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు మోట కట్ల శ్రీనివాస్ రెడ్డి దంపతులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు ధూపాటి పాలంక ప్రసాద్ శర్మ లు వేద పండితులు కర్నూలు వాస్తవ్యులు మామిళ్ళపల్లి నాగఫణి శర్మ మరియు మరికొందరి చేత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు కార్యక్రమానంతరం ఆలయ ప్రాంగణంలోని మేళ తాళాలతో అమ్మవారిని సాంప్రదాయపదంగా అలంకరించి పీఠంపై అదృష్టంపజేసి భక్తులచే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకమండలి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి దంపతులతో పాటు పాలకమండలి సభ్యులు గోళ్ళ గుడిపాటి సాంబశివరావు గుర్రం సునీల్ చౌదరి బాణావత్ తిరుమల ,పళ్ళపాటి గంగమ్మ ,ధూపాటి విశ్వం నారాయణ శాస్త్రి, నాగేశ్వరరావు, , ఏల్చూరి కొండలు, నక్క గోవిందమ్మ డి సుందమ్మ మెడ బలిమి కోటమ్మ సభ్యులందరూ సంప్రదాయ దుస్తులతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుండే క్యూ కట్టారు వచ్చిన భక్తులందరికీ అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు వచ్చిన భక్తులకు అలాంటి ఇబ్బందులు లేకుండా పాలకమండలి వారు దేవస్థానం వారు తగిన సౌకర్యములు ఏర్పరిచారు. దసరా మహోత్సవాలు 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి విశేషా లంకరణములు ప్రారంభమవుతాయి అవి 11న బాలా త్రిపుర సుందరి దేవి పల్లకి సేవ పద్మ వాహనంపై 12న హంస వాహనంపై 13న శ్రీ చంద్ర గంట దేవి వ్యాగ్ర వాహనంపై 14న కూష్మాండ దుర్గాదేవి శేష వాహనంపై 15న శ్రీ స్కందమాత దేవి మయూర వాహనంపై 16న శ్రీ కాత్యాయని దేవి సింహ వాహనంపై 17న శ్రీ కాళరాత్రి దేవి గజవాహనంపై 18న శ్రీ మహా దుర్గాదేవి నంది వాహనంపై 19న సిద్ధిధాయని దేవి హస్వహనంపై 20వ తేదీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి సింహ వాహనంపై ఇలా పలు అలంకారాలలోగ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు మోటకట్ల శ్రీనివాస్ రెడ్డి దేవస్థానం కార్యక్రమం అధికారి ఆలయ ప్రధాన అర్చకులు ధూపాటి పాలంకప్రసాద్ శర్మలు తెలియజేశారు.