BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ...

Select Suryaa Now
వాణి  సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ...

 

నరసన్నపేట నవంబర్ 29 మేజర్ న్యూస్:
నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా ఆదివారం యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ బూరళ్ళి శంకర్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు ప్రచారంలో పాల్గొని పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీగా పర్యటించారు.

ఈ సందర్భంగా తాళం చెవి గుర్తుపై ఓటు వేసి పొట్నూరు వాణి సాయి ప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువత ఓటర్లను అభ్యర్థించారు. నీతివంతమైన పరిపాలన, పారదర్శక పాలన, పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

నరసన్నపేట పట్టణంలోని సమస్యలపై సమగ్ర అవగాహనతో, వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తామని ప్రచారంలో వివరించారు. పట్టణంలోని సమస్యలన్నింటినీ పుస్తక రూపంలో సేకరించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.