వాల్మీకిపురంలో ఘనంగా నల్లవీర గంగాభవాని అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు
వాల్మీకిపురంలో ఘనంగా నల్లవీర గంగాభవాని అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు
వాల్మీకిపురం: శ్రీ శ్రీ శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలను ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మొర్రం రెడ్డి రాంమ్‌కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 10న కలశస్థాపన, ధ్వజారోహణ, అఖండ జ్యోతి కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం ప్రతిరోజూ అమ్మవారిని వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల వివరాలు:
- అక్టోబర్ 11: శ్రీ బాలా త్రిపురసుందరి దేవి
- అక్టోబర్ 12: శ్రీ గాయత్రీ దేవి
- అక్టోబర్ 13: శ్రీ అన్నపూర్ణ దేవి
- అక్టోబర్ 14: శ్రీ వారాహి దేవి
- అక్టోబర్ 15: శ్రీ ప్రత్యంగిరా దేవి
- అక్టోబర్ 16: శ్రీ మహా సరస్వతీ దేవి (మూల నక్షత్రం)
- అక్టోబర్ 17: శ్రీ మహాలక్ష్మీ దేవి
- అక్టోబర్ 18: శ్రీ దుర్గా దేవి (దుర్గాష్టమి)
- అక్టోబర్ 19: శ్రీ మహిషాసురమర్దిని దేవి
- అక్టోబర్ 20: శ్రీ రాజరాజేశ్వరి దేవి
ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజూ పంచామృత అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భక్తాదులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు కోరారు.
కుంకుమార్చన చేయదలచిన భక్తులు సంప్రదించవలసిన ఫోన్:
పూజారి జనార్ధన స్వామి – 9885060148
ఇట్లు:
ఆలయ ధర్మకర్త
మొర్రం రెడ్డి రాంమ్‌కుమార్ రెడ్డి
ఆలయ కమిటీ సభ్యులు