ఉత్సాహంగా టీడీపీ చైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తా నామినేషన్
నరసరావుపేట : పట్టణంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసారపు సుబ్బరాయగుప్తా తనయుడు రూపేష్ గుప్తా చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీతోనే నరసరావుపేట సమగ్ర అభివృద్ధి సాధ్యమని, యువ నాయకత్వం, సీనియర్ల అనుభవంతో పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరు స్తామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…