BREAKING
కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్

Select Suryaa Now
ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్

 

అనంతపురం బ్యూరో: ఉరవకొండ పట్టణంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వివిధ సమస్యలపై ప్రజలు, స్థానిక నాయకులు సమర్పించిన అర్జీలను మంత్రి పయ్యావుల కేశవ్ స్వీకరించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు.

అర్జీదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజాదర్బార్‌లో వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.