BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

ఉప్పాడ

Select Suryaa Now
ఉప్పాడ

ఉప్పాడకు రక్షణ కవచం

పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ

దశాబ్దాల కల సాకారం దిశగా కీలక అడుగులు

 

ఎం.గణేశ్, సూర్య ప్రధాన ప్రతినిధి


సముద్ర కోతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ నిధులు సమీకరించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర రక్షణ గోడ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. దీంతో ఉప్పాడ ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా సాగుతున్న పరిణామాలపై తీర ప్రాంతంలో ఆశాభావం వ్యక్తమవుతోంది.పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరానికి శాశ్వత రక్షణ కల్పించేందుకు రూ.323 కోట్ల జాతీయ విపత్తు నిర్వహణ నిధులతో చేపట్టనున్న రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన కీలక సాంకేతిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచస్థాయి సాంకేతిక నైపుణ్యం కలిగిన ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ప్రాజెక్టుకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన పనులను ప్రారంభించింది.ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీరంలో విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో సముద్ర కోతను సమర్థవంతంగా అడ్డుకునేలా రక్షణ గోడ నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతం, నిర్మాణ విధానం, సాంకేతిక ప్రమాణాలను శాస్త్రీయంగా నిర్ధారించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు.

అత్యాధునిక డ్రోన్లతో పాటు ట్రింబుల్ ఆర్-980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే సాంకేతికతను వినియోగిస్తూ తీర ప్రాంతాన్ని సమగ్రంగా మ్యాపింగ్ చేస్తున్నారు. సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, భౌగోళిక పరిస్థితులు, భూభాగంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు.సముద్రపు అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు. తీర ప్రాంతం వెంట ఇసుక, మట్టి అవశేషాల నమూనాలను కూడా సేకరిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సముద్రపు అడుగు భాగం స్థాయిలు, వాటిలో చోటుచేసుకున్న మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తు, తీర రేఖ మార్పులపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.ఈ శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీరానికి అత్యంత సమర్థవంతమైన రక్షణ వ్యవస్థను రూపొందించనున్నారు. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని దీర్ఘకాలికంగా ఎదుర్కొనే విధంగా రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన అలైన్‌మెంట్‌ను ఐఐటీ మద్రాస్ నిపుణులు ఖరారు చేయనున్నారు. సర్వే పూర్తయిన అనంతరం డిజైన్, డీపీఆర్‌తో పాటు ఇతర సాంకేతిక అంశాలను సిద్ధం చేయనున్నారు.గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే సముద్ర కోత కారణంగా భూములు, నివాస ప్రాంతాలు కోల్పోయిన కుటుంబాలకు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతిపాదన మేరకు సీ ప్రొటెక్షన్ వాల్, గ్రోయిన్ ఫీల్డ్‌తో పాటు హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలకు ఆమోదం లభించడం ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ చొరవ, ఐఐటీ మద్రాస్ సాంకేతిక నైపుణ్యం కలిసిరావడంతో ఉప్పాడ తీర రక్షణ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది.ప్రాజెక్టు డిజైన్, డీపీఆర్‌ను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు పర్యావరణం, ఇతర అనుమతుల ప్రక్రియను సమాంతరంగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పిఠాపురం పర్యటన సందర్భంగా ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో ప్రాజెక్టు పురోగతి, డిజైన్, డీపీఆర్‌పై ఆయన సమీక్షించనున్నారు.దశాబ్దాలుగా సముద్రాన్ని ఎదుర్కొంటూ జీవిస్తున్న ఉప్పాడ ప్రజలకు ఇప్పుడు అదే సముద్రం నుంచి శాశ్వత రక్షణ కల్పించే పనులు మొదలయ్యాయి. రూ.323 కోట్ల భారీ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఐఐటీ మద్రాస్ సాంకేతిక నైపుణ్యం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఉప్పాడ తీరానికి కొత్త భరోసా ఏర్పడింది. తమ ప్రాంతానికి రక్షణ గోడ నిర్మాణం దిశగా పనులు ప్రారంభం కావడంపై ఉప్పాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవను అభినందిస్తున్నారు.