BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

మందులు ఇచ్చే చేతులు..ప్రాణాలకు భరోసా

Select Suryaa Now
మందులు ఇచ్చే చేతులు..ప్రాణాలకు భరోసా

మందులు ఇచ్చే చేతులు..ప్రాణాలకు భరోసా.

ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.

పలాస, సెప్టెంబర్‌ 25, మేజర్ న్యూస్.

మందులు ఇచ్చే చేతులు ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తాయని, ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా శుక్రవారం పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో ఫార్మసిస్టులతో కలిసి కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఫార్మసిస్టులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యులు సూచించిన మందులను రోగులకు సక్రమంగా అందించడంతో పాటు వాటి మోతాదు,వినియోగ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టులు కీలక బాధ్యత నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మందుల వినియోగంపై సరైన సూచనలు అందిస్తూ ప్రజల ప్రాణాలకు భరోసా గా ఫార్మసిస్టులు నిరంతరం సేవలందిస్తున్నారని వారిని కొనియాడారు.కరోనా మహమ్మారి సమయంలో ఫార్మసీ రంగం అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే శిరీష అన్నారు.కోవిడ్‌ వ్యాక్సిన్లు,ఔషధాల తయారీ,సరఫరాతో పాటు అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంలో ఫార్మసీ రంగానికి చెందిన వారు విశేష కృషి చేశారని తెలిపారు.క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు అవసరమైన ఔషధ సేవలు అందించడంలో ఫార్మసిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభినందించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజారోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా చేరేలా ఫార్మసిస్టులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.మందులు సరైన వినియోగం,ఆరోగ్య పరిరక్షణ,ప్రభుత్వ వైద్య సేవలు,ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మరింత చొరవ చూపాలని కోరారు.వైద్య ఆరోగ్య వ్యవస్థలో వైద్యులు, నర్సులు,ఇతర వైద్య సిబ్బందితో పాటు ఫార్మసిస్టులు కూడా కీలక భాగస్వాములని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా,అంకితభావంతో సేవలందిస్తున్న ఫార్మసిస్టుల సేవలను సమాజం గుర్తించాలని అన్నారు. భవిష్యత్తులోనూ నాణ్యమైన ఔషధ సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఫార్మసిస్టులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనెల గోపాల్,జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రేజేటి సుబ్రహ్మణ్యం,సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ రమేష్,ఫార్మసీ ఆఫీసర్లు లీల, ఎ.స్వర్ణ,సతీష్,శైలజ,దీప,తులసి, ఎస్.స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.